భారతదేశం, నవంబర్ 13 -- Itllu Arjuna Review:

సినిమా పేరు : ఇట్లు అర్జున

నటీనటులు : అనీష్, అనస్వర రాజన్, ముఖేష్ రుషి, కలైయారసన్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితరులు

డైరెక్టర్ : మహేష్ ఉప్పాల

ప్రొడ్యూసర్ : వెంకీ కుడుముల

మ్యూజిక్ డైరెక్టర్ : తమన్

రిలీజ్ డేట్ : నవంబర్ 13, 2026

భారీ ప్రమోషన్స్‌తో టాలీవుడ్‌లో మంచి బజ్ క్రియేట్ చేసిన సినిమా 'ఇట్లు అర్జున'. కొత్త హీరో అనీష్ ఎంట్రీ ఇస్తూ, మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం నేడు (నవంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త దర్శకుడు మహేష్ ఉప్పల తెరకెక్కించిన ఈ మూవీకి డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రొడ్యూసర్. మూగ కుర్రాడి ప్రేమకథకి, ఓ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ కథకి ముడిపెట్టి తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

పెద్దన్న (ముఖేష్ రుషి) ఒక పవర్ఫుల్ గ్య...