భారతదేశం, జూలై 28 -- అంచనా సంవత్సరం (AY) 2026-27కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు తమ రిఫండ్ సొమ్ము కోసం నిరీక్షిస్తున్నారు. జులై 31 నాటికి ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు ముగుస్తుండటంతో, ఇప్పటికే ప్రాసెస్ పూర్తి చేసిన అనేక మంది ఖాతాల్లో రిఫండ్ నిధులు జమ కావడం లేదు. ఆర్థిక సంవత్సరంలో ఒక పౌరుడు చెల్లించాల్సిన అసలు పన్ను కంటే ఎక్కువ మొత్తం జమ చేసిన సందర్భాల్లో ఆదాయపు పన్ను శాఖ ఆ అదనపు మొత్తాన్ని రిఫండ్ రూపంలో తిరిగించేస్తుంది.

రిటర్న్ విజయవంతంగా ప్రాసెస్ అయ్యి, వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే రీఫండ్ ఖాతాలో పడుతుంది. చిన్నపాటి పొరపాట్లు లేదా సమాచార లోపాలు ఉన్నా ఈ ప్రక్రియ నిలిచిపోతుంది.

బ్యాంకు ఖాతా ప్రీ-వాలిడేషన్ లోపాలు: ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసిన బ్యాంకు ఖాతా వివరాలు తప్పుగా ఉన...