భారతదేశం, ఆగస్టు 22 -- తిరుపతిలోని ఇస్కాన్ (ISKCON) ఆలయంలో ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను ఇస్కాన్ ఆలయ ప్రాంగణంలోని గౌరాంగ భవన్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆలయ ఛైర్మన్ రేవతి రమణ ప్రభు ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వైస్ ఛైర్మన్ రూపేష్ చైతన్య ప్రభుతో పాటు ఇతర ప్రతినిధులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

సెప్టెంబర్ 4వ తేదీన జరిగే ప్రధాన శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఆగస్టు 23 నుండి వైవిధ్యమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక, భక్తి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

శ్రీకృష్ణ చైతన్య అమృతాన్ని భక్తులకు అందించేందుకు భాగంలో శ్రీ శ్రీ రాధా గోవిందజీ ఉంజల్ సేవ (డోలోత్సవం) ఆగస్టు 23 నుంచి 28వ తేదీ వర...