భారతదేశం, ఆగస్టు 22 -- Ravi Teja Irumudi 1st Day Worldwide Box Office Collection: మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన సరికొత్త తెలుగు రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ కొట్టింది. నిన్న (ఆగస్ట్ 21) థియేటర్లలో విడుదలైన ఇరుముడి సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

ఫాదర్-డాటర్ ఎమోషనల్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ ఇరుముడి చిత్రం మొదటిరోజే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రవితేజ మార్కెట్ బలాన్ని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా తొలిరోజు కలెక్షన్ల వర్షం కురిపించింది.

ప్రముఖ ట్రేడ్ నివేదికల ప్రకారం.. 'ఇరుముడి' చిత్రం భారత్ వ్యాప్తంగా మొదటిరోజు రూ. 14.80 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 2,673 షోలలో ప్రదర్శితమ...