భారతదేశం, సెప్టెంబర్ 13 -- Irumudi Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తూ రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ 'ఇరుముడి'. ఇంతటి ఘన విజయం సాధించిన ఇరుముడి టీమ్ ను మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందించారు. తమ ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. ఈ ఫొటోలువ వైరల్ అవుతున్నాయి.

రవితేజ హీరోగా నటించిన ఇరుముడి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.280 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో హీరో రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ, ప్రొడ్యూసర్లు నవీన్ యెర్నేని, రవి శంకర్ ను చిరంజీవి, రామ్ చరణ్ అభినందించారు.

ఇరుముడి మూవీ టీమ్ తో చిరంజీవి, రామ్ చరణ్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో రామ్ చరణ్ క్యామియో రూమర్లపై మాట్లాడుకున్నారని తెలిసింది. ఇరుముడిలోని మల్ల...