భారతదేశం, ఏప్రిల్ 6 -- ఈ వేసవి వేళ చాలా మంది అధ్యాత్మిక ప్రాంతాలను చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో ఐఆర్సీటీసీ సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను చూసేందుకు విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది.

ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లోని వివరాల ప్రకారం. ఈ ప్యాకేజీని తమిళనాడు టెంపుల్స్ అండ్ హిల్స్ EX విజయవాడ పేరుతో ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఏప్రిల్ 25వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో బుకింగ్ చేసుకోవాలి. ఆసక్తి గల వాళ్లు. టికెట్లు ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ప్యాకేజీ ధరలు చూస్తే. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. Rs.51050, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 37900, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 36300గా ఉంది. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే 9281030714...