భారతదేశం, నవంబర్ 29 -- ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ్ యాత్ర పేరుతో టూర్ ప్యాకేజీ నడుపుతోంది. 3 జనవరి 2027న తీసుకెళ్లనుంది. ఈ టూర్ 9 రోజులు, 8 రాత్రులతో ఉంటుంది. ట్రైన్‌లో వెళ్లాల్సి ఉంటుంది. మెుత్తం 705 సీట్లు ఉంటాయి. తిరువణ్ణామలై: అరుణాచలం ఆలయం, చిదంబరం: నటరాజ ఆలయం, తిరుచ్చి: శ్రీ రంగనాథస్వామి ఆలయం, తంజావూరు: బృహదీశ్వరాలయం, రామేశ్వరం: రామనాథస్వామి ఆలయం, మధురై: మీనాక్షి అమ్మన్ ఆలయం, కన్యాకుమారి: రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ టెంపుల్ దర్శనం చేసుకుంటారు. సికింద్రాబాద్, చర్లపల్లి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో రైలు ఎక్కవచ్చు.

మెుదటి రోజు జనవరి 3వ తేదీన సికింద్రాబాద్ నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. రెండో రోజు ఉదయం 8 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. బస చేసే ప్రదేశానికి వెళ్త...