భారతదేశం, సెప్టెంబర్ 20 -- ఐఆర్‌సీటీసీ అందించే టూర్ ప్యాకేజీలు మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో దొరుకుతాయి. అక్టోబర్ 2వ తేదీన అరుణోదయ అరుణాచల్ ఎక్స్ హైదరాబాద్ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఈ యాత్ర ఉంటుంది. దిరంగ్, గౌహతి, తవాంగ్, తేజ్‌పూర్‌లాంటి ప్రాంతాలకు చుట్టేసి రావొచ్చు. మెుత్తం 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. విమానంలో ప్రయాణిస్తారు.

ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరి గౌహతి చేరుకుంటారు. అక్కడి నుండి తేజ్‌పూర్ (190 కి.మీ)కు ప్రయాణం ఉంటుంది. హోటల్‌లో చెక్ ఇన్ ఉంటుంది. తేజ్‌పూర్‌లో రాత్రి భోజనం, బస చేస్తారు..

అల్పాహారం చేసి హోటల్ నుండి చెక్-అవుట్ అవుతారు. దిరాంగ్ (200 కి.మీ)కు బయలుదేరుతారు. మార్గమధ్యలో టిప్పి ఆర్కిడ్ సెంటర్, వేడి నీటి బుగ్గలను సందర్శిస్తారు. మధ్యాహ్నం బొమ్డిలా బౌద్ధ మఠాన్ని సందర్శిస్తారు. దిరాంగ్‌లో రాత్రి...