భారతదేశం, నవంబర్ 1 -- షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.? హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ వచ్చేసింది. మూడు రోజుల పాటు టూర్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఐఆర్సీటీసీ టూరిజం తీసుకువచ్చిన ఈ టూర్(సాయి శివమ్) ప్యాకేజీలో భాగంగా. షిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవచ్చు. మరికొన్ని ప్రదేశాలను కూడా చూడొచ్చు.

ప్రతీ శుక్రవారం కాచిగూడ నుంచి బయలుదేరే ఈ టూర్ మొత్తం 3 రాత్రులు, 4 రోజుల పాటు కొనసాగుతుంది. https://www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.

ఈ ప్యాకేజీ ధరలు చూస్తే.. సింగిల్ షేరింగ్ కు రూ.11560గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 9430,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 9240గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 9870, డబుల్ షేరింగ్ కు...