భారతదేశం, నవంబర్ 27 -- షిర్డీ సాయిబాబా ఆలయం, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, నాసిక్‌లోని పంచవతి క్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం IRCTC టూరిజం అప్డేట్ ఇచ్చింది. 'సాయి శివం' (ప్యాకేజీ కోడ్ - SHR008) టూర్ ప్యాకేజీని నిర్వహిస్తోంది. మూడు రాత్రులు, నాలుగు రోజుల పాటు సాగే ఈ ప్యాకేజీ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం డిసెంబర్ 4వ తేదీన జర్నీ ఉంది.

కంఫర్ట్ (3ఏసీ), స్టాండర్డ్ (స్లీపర్ నాన్ ఏసీ) కేటగిరీలలో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఒక్కో ప్రయాణికుడికి నిర్ణయించిన ఛార్జీలు ఇలా ఉన్నాయి.

కంఫర్ట్ (3ఏసీ) సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 11,560, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 9,430, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 9,240 నిర్ణయించారు. ఐదు నుంచి పదకొండు ఏళ్లలోపు పిల్లలకు బెడ్‌తో కలిపి రూ. 8,400, బెడ్ లేకుండా రూ. 7,460 ఛార్జీ వసూలు చేస్తారు.

స్టాండర్డ్ ...