భారతదేశం, ఏప్రిల్ 12 -- బడ్జెట్ ధరలో ఐఆర్‌సీటీసీ పలు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. మధ్యతరగతివారు కూడా ఈ ప్యాకేజీల్లో టూర్లు తిరిగిరావొచ్చు. దేశంలో ముఖ్యమైన ప్రదేశాలకు ఈ టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే తీర్థయాత్ర పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల కోసం నాలుగు ప్రత్యేక 'భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు' ప్యాకేజీలను ప్రకటించింది.

ఈ రైళ్లు ఏప్రిల్ 14 నుండి జూన్ 12 మధ్య సికింద్రాబాద్ నుండి నడవనున్నాయి. గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడిస్తూ.. జాయింట్ జనరల్ మేనేజర్ (టూరిజం) డి.ఎస్.జీ.పీ.కిషోర్ మాట్లాడారు. భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలకు భక్తులకు ఒక సమగ్రమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని తె...