భారతదేశం, నవంబర్ 8 -- Hyderabad to Arunachalam Tour Package : తెలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడులోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన అరుణాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసేందుకు భావోద్వేగంతో కూడిన ఆధ్యాత్మిక ఆసక్తిని భక్తులు కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఆర్సీటీసీ టూరిజం. 'అరుణాచల మోక్ష యాత్ర' (ప్యాకేజీ కోడ్: SHR107) పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది.

ఈ ప్యాకేజీ ద్వారా అరుణాచల శివక్షేత్రం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికం, పర్యాటకం కలగలిసిన కాంచీపురంతో పాటు పాండిచేరి ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు. ప్రస్తుతం నవంబర్ 13వ తేదీన జర్నీ అందుబాటులో ఉంది. అయితే ఆసక్తి గల టూరిస్టులు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం 4 రాత్రులు, 5 రోజుల పాటు సాగుతుంది. సికింద్రాబాద్ ...