భారతదేశం, మార్చి 14 -- గతేడాది డిసెంబర్‌లో విడుదలై భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని వసూళ్లతో రికార్డులు తిరగరాసిన చిత్రం 'ధురంధర్'. రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ నెలలు గడుస్తున్నా ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది.

తాజాగా ధురంధర్ సినిమాపై హీరోయిన్ స్వరా భాస్కర్ తల్లి, ప్రముఖ ఫిల్మ్ స్కాలర్ ఐరా భాస్కర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చిత్రంలోని రాజకీయ కోణంపై ఐరా భాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఇటీవల 'కార్వాన్ ఎ మొహబ్బత్' అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐరా భాస్కర్ మాట్లాడుతూ.. భారతీయ సినిమాలో కథలు చెప్పే విధానం ఎలా మారిపోయిందో వివరించారు.

"కోట్లు కొల్లగొడుతున్న ధురంధర్ వంటి సినిమాలను చూస్తుంటే.. ఒక ప్రత్యేక భావజాలానికి లోబడిన దర్శకులు వీటిని తెరకెక్కిస్తున్నారని అర్థమవు...