భారతదేశం, నవంబర్ 7 -- అడవి తల్లి ఒడిలో దొరికే ప్రకృతి ప్రసాదం 'ఇప్ప పువ్వు'.! ఇప్పటివరకు మనం ఇప్ప పువ్వుతో తయారు చేసిన లడ్డూలు, ఇతర సంప్రదాయ పిండి వంటల రుచులను మాత్రమే ఆస్వాదించి ఉంటాం. కానీ, ఇప్పుడు ఆ అటవీ ఉత్పత్తులకు సరికొత్త మెరుగులు దిద్దుతూ. ములుగు జిల్లాకు చెందిన ఆడబిడ్డలు ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే 'ఇప్ప పువ్వు టీ' ని అందుబాటులోకి తెచ్చి పర్యాటకులకు సరికొత్త ఆతిథ్యాన్ని అందిస్తున్నారు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం పరిధిలోని కొండపర్తి గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాలు (మహిళా గ్రూపులు) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'ఇప్ప పువ్వు టీ స్టాల్'ను మంత్రి సీతక్క శుక్రవారం ప్రారంభించారు. స్థానిక గిరిజన మహిళలు స్వయంగా సేకరించిన ఇప్ప పువ్వులతో ఈ ప్రత్యేకమైన టీని తయారు చేసి విక్రయిస్తున్నారు.

ప్రాకృతిక రుచులక...