భారతదేశం, మే 9 -- IPL 2026 KKR Playoffs Scenario : ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పరిస్థితి చూస్తే, ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉంటుందని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. ఏప్రిల్ మధ్య నాటికి ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేక పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

పంజాబ్ కింగ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో లభించిన ఆ ఒక్క పాయింట్ మాత్రమే అప్పట్లో కేకేఆర్ ఖాతాలో ఉంది. కానీ.. క్రికెట్‌లో ఒక విజయం ఇచ్చే ఆత్మవిశ్వాసం జట్టు రూపురేఖలనే మారుస్తుందని కేకేఆర్ నిరూపిస్తోంది. అజింక్య రహానే నాయకత్వంలోని ఈ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయకేతనం ఎగురవేసి.. ఇప్పుడు రేసులోకి వచ్చింది.

శుక్రవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు...