భారతదేశం, ఏప్రిల్ 20 -- వరుస ఓటములతో సతమతమవుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరాటంలో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రింకూ సింగ్ (53 నాటౌట్), అనుకుల్ రాయ్ (29 నాటౌట్) అసాధారణ భాగస్వామ్యంతో జట్టును గెలిపించి.. ఈ సీజన్లో తొలి పాయింట్లను అందించారు.
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. జోఫ్రా ఆర్చర్ వేసిన మొదటి ఓవర్లోనే టిమ్ సీఫెర్ట్ డకౌట్ కాగా, కెప్టెన్ అజింక్యా రహానే కూడా ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.
కేవలం 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో రింకూ సింగ్, అనుకుల్ రాయ్ బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఈ జంట కేవలం 37 బంతుల్లోనే 76 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.