Inter Permanent Education Number : తెలంగాణ ఇంటర్ సర్టిఫికెట్లపై PEN-పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబరు
భారతదేశం, అక్టోబర్ 7 -- తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్న లక్షలాది మంది విద్యార్థుల విద్యా ధ్రువపత్రాల నిర్వహణ, డిజిటలైజేషన్ ప్రక్రియలో ఇంటర్మీడియట్ బోర్డు అత్యంత కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నుంచి విద్యార్థుల మార్కుల సర్టిఫికెట్లపై పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబరు(PEN - Permanent Education Number) ను ముద్రించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ వెల్లడించారు.
ఈ కొత్త విధానం వల్ల విద్యార్థుల విద్యా ప్రయాణాన్ని సులభంగా ట్రాక్ చేయడమే కాకుండా.. విపత్తుల సమయంలో సర్టిఫికెట్లు పోకుండా డిజిటల్ రూపంలో సురక్షితంగా భద్రపరుచుకునే వెసులుబాటు కలుగుతుంది. పాఠశాల విద్యార్థులకు యూడైజ్ పోర్టల్ ద్వారా కేటాయించే 11 అంకెల విశిష్ట సంఖ్యనే పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబరు (PEN)...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.