భారతదేశం, జూలై 26 -- Indiramma Towers Hyderabad : హైదరాబాద్ మహానగరంలోని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే. ఈ పథకానికి సంబంధించి ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి మరియు దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రత్యేక కాల్ సెంటర్ హెల్ప్‌లైన్‌ను ప్రభుత్వం శనివారం ప్రారంభించింది.

హౌసింగ్ బోర్డు కార్యాలయంలో ఈ హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం రాష్ట్ర శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ప్రజలు ఎలాంటి అపోహలు. గందరగోళానికి గురికాకుండా, దళారులు లేదా మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా అధికారిక సమాచారం తెలుసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

క్యూర్ పరిధిలో మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. అందులో భాగ...