భారతదేశం, నవంబర్ 19 -- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.5 లక్షల 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' (Indiramma Family Insurance Scheme) రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 19 నుంచే. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేటలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకం దరఖాస్తు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తారు.

రాష్ట్రంలోని అర్హులైన రేషన్ కార్డు కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు, పూర్తిగా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఒక సభ్యుడికి రూ.5 లక్షల జీవిత బీమా కవరేజీని అందిస్తుంది. బీమా చేయించుకున్న వ్యక్తి మరణించిన పక్షంలో, నామినీలుగా పేర్కొన్న కుటుంబ సభ్యులకు ఈ బీమా సొమ్ము అందుతుంది. కుల, మత, ఆదాయ భేదాలు ...