Indian Student death in UK : లండన్‌లో కామారెడ్డి విద్యార్థి అనుమానాస్పద మృతి..! విషాదంలో కుటుంబం
భారతదేశం, జూన్ 27 -- లండన్‌లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న తెలంగాణకు చెందిన ఒక యువ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన 25 ఏళ్ల ఎస్. శ్రీనాథ్ రెడ్డి లండన్‌లో విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషాద వార్తను అతడి కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం తలమడ్ల గ్రామానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి, ఉన్నత విద్యను అభ్యసించేందుకు 14 నెలల క్రితం లండన్‌కు వెళ్లాడని అతని తండ్రి మధుసూదన్ రెడ్డి కన్నీటిపర్యంతమవుతూ తెలిపారు. తన కుమారుడు ఎలా చనిపోయాడనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు, పరిస్థితులు ఇప్పటివరకు తమకు తెలియరాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విదేశాల్లో ఉన్న కొడుకు అకాల మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వాపోయారు. శ్రీనాథ్ రెడ్డి భౌతికకాయాన్ని వీలైనంత త్వరగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.