భారతదేశం, జూలై 14 -- ఐర్లాండ్​ చేతిలో ఘోర భంగపాటు, ఇంగ్లాండ్​ చేతిలో పరాజయం అనంతరం టీమిండియా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కొన్ని రోజుల క్రితం టీ20 సిరీస్​లో ఓటమి అనంతరం టీమిండియా.. శుభ్​మాన్ గిల్​ సారథ్యంలో, ఇంగ్లాండ్​తో నేడు తన వన్డే సిరీస్​ని ప్రారంభించనుంది. లెజెండ్స్ విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలు చేరడంతో పేపర్​ మీద మన జట్టు బలంగా ఉంది. మరీ ముఖ్యంగా అందరి చూపు ఇప్పుడు బుమ్రాపై ఉండనుంది. 2023 వరల్డ్​ కప్ అనంతరం అతను ఆడుతున్న తొలి వన్డే మ్యాచ్​ ఇదే! ఇక ఇటీవలి కాలంలో టెస్టులు, టీ20ల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఈ వన్డే సిరీస్ విజయం అత్యంత కీలకంగా మారింది. ఎలాగైనా ఆధిపత్యం చాటి విమర్శకులకు సమాధానం చెప్పాలని గంభీర్ వ్యూహాలు రచిస్తున్నాడు.

3 మ్యాచుల సిరీస్​లో భా...