భారతదేశం, జూన్ 14 -- ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా ఇరు జట్లకు చెరి 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుండి నడిపించి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అఫ్గానిస్తాన్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 22.5 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

లక్ష్య ఛేదనలో భారత జట్టుకు ఓపెనర్లు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కేవలం 66 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 34(22 బంతుల్లో 3x4, 1x6)) పరుగుల వద్ద అవుట్ కాగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కేవలం 19 బంతుల్లోనే 39 పరుగులు చేసి అజేయంగా నిలి...