భారతదేశం, జూన్ 20 -- Imtiaz Ali About Burqa And Purdah Wearing: బాలీవుడ్ అగ్ర దర్శకుడు ఇంతియాజ్ అలీ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సామాజిక చర్చకు దారితీస్తున్నాయి. మహిళలు బుర్కా ధరించడం, పర్దా పద్ధతిని పాటించడం వెనుకబాటుతనానికి, సమాజ క్షీణతకు నిదర్శనమని ఆయన గట్టిగా అభిప్రాయపడ్డారు.

ఈ సాంప్రదాయ పద్ధతుల్లో తాము సౌకర్యంగానే ఉన్నామని కొందరు మహిళలు చెప్పే మాటలను స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ పూర్తిగా తోసిపుచ్చారు. సాధారణంగా ఇంతియాజ్ అలీ సినిమాలు ప్రేమ, మానవ సంబంధాలు, అంతర్మథనం చుట్టూ తిరుగుతుంటాయి. సామాజిక, రాజకీయ అంశాలపై ఆయన చాలా అరుదుగా స్పందిస్తుంటారు.

అలాంటిది, ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన దేశ విభజన నాటి భావోద్వేగ భరిత చిత్రం 'మై వాపస్ ఆవుంగా' (Main Vaapas Aaunga) విడుదలైన నేపథ్యంలో ఒక ప్రముఖ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఇంతి...