భారతదేశం, అక్టోబర్ 15 -- Imran Khan Asked To Leave India By October 28th: బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ మేనల్లుడు, యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్‌కు భారత ప్రభుత్వం నుంచి ఊహించని షాక్ తగిలింది. ఈ నెల అంటే అక్టోబర్ 28వ తేదీలోగా దేశం విడిచి వెళ్లాలని ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) ఆయనకు నోటీసులు జారీ చేసింది.

ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డు ఆధారంగా భారతదేశంలో నివసిస్తున్న ఇమ్రాన్ ఖాన్, నిబంధనలకు విరుద్ధంగా ఒక రాజకీయ ఆందోళనలో పాల్గొన్నారనే ఆరోపణలతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

ముంబైలోని ఖార్ ప్రాంతంలో నివసిస్తున్న ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడు. అక్టోబర్ 10న ముంబై సెంట్రల్‌లోని అగస్ట్ క్రాంతి మైదాన్‌లో 'కాక్రోచ్ జనతా పార్టీ' ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన కా...