భారతదేశం, మార్చి 11 -- వేసవి రావటంతో ఎండలతో తెలంగాణ వాసులు ఇబ్బందిపడుతున్నారు. ఉదయం 10 దాటితే చాలు. ఎండ తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నం సమయంలో అయితే భానుడి భగభగలు ఎక్కువగానే ఉంటున్నాయి. ఆ సమయంలో బయటికి వెళ్లాలంటే వెనకడుగు వేస్తున్నారు. మార్చి నెలలోనే ఈస్థాయి ఎండల తీవ్రత ఉండటంతో.. రాబోయే రోజుల్లో ఎండలు ఎక్కువగానే ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పుడిప్పుడే ఎండల తీవ్రత మొదలు కాగా.. తెలంగాణకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం.. మార్చి 14వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుంది. అయితే మార్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.