భారతదేశం, సెప్టెంబర్ 3 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో సుక్కు లేకుంటే బతకలేనని తిరుపతి అంటాడు. ప్రేమను ధీరజ్ ఆపుతాడు. ఇన్నేళ్లలో మావయ్య అడిగిన కోరిక ఇదొక్కటే, తీర్చకుంటే ఎలా అని ధీరజ్ అంటాడు.

వేరే అమ్మాయి అయితే నేను కాదనేదాన్ని కాదు. ఇప్పటికే వల్లి వల్ల ఎన్నో జరిగాయి. ఇప్పుడు బాబాయ్‌ని ఇది చేసుకుంటే ఇంకా ఏం చేస్తారో అని ప్రేమ హెచ్చరించి ఒప్పుకోనంటుంది. నువ్వేంటే ఒప్పుకునేది బోడి అని ధీరజ్ అంటాడు. ధీరజ్, ప్రేమ వాదించుకుంటారు. తర్వాత నువ్వంటే ఇష్టం లేకున్నా తర్వాత ప్రేమించానుగా. సుక్కు కూడా మారుతుందని ధీరజ్ అంటాడు.

సాయంత్రం పెళ్లి చూపులను ఎలాగైనా చెడగొడతానని ధీరజ్ అంటాడు. ధీరజ్, ప్రేమ వెళ్లిపోతారు. నా అల్లుడు ఉన్నాడు. ఇక మన పెళ్లి అయిపోయినట్లే అని తిరుపతి అంటాడు. మరోవైపు డబ్బు గురించి, త...