భారతదేశం, సెప్టెంబర్ 28 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమ కోసం చింతామణి ఇంట్లోకి శ్రీవల్లి గ్యాంగ్ దొంగచాటుగా వెళ్తుంది. కర్చీఫ్‌పై మత్తుమందు స్ప్రే చేస్తుంది వల్లి. కర్చీఫ్‌లో సెంట్ రాసుకుని చూస్తున్నావ్. ఇదేమైనా న్యాయమేనా అని భాగ్యం అంటుంది.

ఇది క్లోరోఫామ్. ప్రేమకు మత్తుమందు ఇచ్చి తీసుకెళ్తాదం. నర్మదకు ప్రేమను అప్పగించి చేసిన పాపాల్లో కొంచెమైనా కడిగేసుకోవచ్చు అని శ్రీవల్లి అంటుంది. చింతామణి ఫోన్ మాట్లాడుతుంటుంది. ముందు దీనికి ఇద్దామే మత్తుమందు. నన్ను కొట్టిందని భాగ్యం అంటుంది. తీరా ప్రేమ దగ్గరికి వెళ్లేసరికి క్లోరోఫామ్ పనిచేయకపోతే రౌడీలు వచ్చి మమ్మల్ని కొడతారు. అది తట్టుకునే శక్తి మాకు లేదని ఇడ్లీ బాబాయ్ అంటాడు.

టెస్ట్ చేస్తానని చెప్పి తనే వాసన చూస్తుంది వల్లి. దాంతో స్పృహతప్పి ప...