భారతదేశం, సెప్టెంబర్ 26 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో పెళ్లి మండపానికి బయలుదేరదామని సాగర్ అంటే.. ప్రేమ గురించి ఆలోచిస్తాడు ధీరజ్. అంతలా ఏం ఆలోచిస్తున్నావురా. ప్రేమ వస్తుందా రాదా అనా అని వేదవతి అడుగుతుంది.

నా మీద తనకున్న ప్రేమ కచ్చితంగా వచ్చేలా చేస్తుంది. ఒకవేళ పంతానికి పోయి ప్రేమ రాకుంటే జీవితంలో నా మొహం తనకు చూపించను అని ధీరజ్ అంటాడు. ఒకవేళ ఇవాళ పెళ్లి జరగకపోతే మావయ్యగారు ఛాలెంజ్ చేసిన ప్రకారం నీకు ప్రేమకు ఎలాంటి సంబంధం ఉండదు కదూ. ఈ ఇంటికి ప్రేమ దూరంగా ఉండిపోతుంది కదా అని శ్రీవల్లి సంతోషంగా అంటుంది.

దాంతో వేదవతి బాగా తిడుతుంది. శ్రీవల్లి భుజంపై చేయి వేసి ఇప్పుడు ఏమంటావ్ అని అడుగుతుంది నర్మద. దాంతో వల్లి భయపడిపోతుంది. ఇంతలో శారదాంబ కంగారుగా వచ్చి ప్రేమను చింతామణి ఇంట్లో బలవతంగా ఉంచాల...