భారతదేశం, సెప్టెంబర్ 25 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్ పెళ్లి గురించి అంతా సంతోషిస్తుంటే శ్రీవల్లి నవ్వుతుంది. ఎందుకు నవ్వు అని నర్మద అడిగితే.. ఇది జరుగుతుందా ఏంటీ అని వల్లి అంటుంది. ఎగిరిపడు. నర్మద ధీరజ్‌ల పెళ్లి కాగానే నీ సంగతి తేలుస్తానని నర్మద వార్నింగ్ ఇస్తుంది.

దీని వార్నింగ్‌తో సంతోషంగా కూడా ఉండలేకపోతున్నా అని వల్లి అనుకుంటుంది. ధీరజ్‌కు మంగళస్నానాలు చేస్తారు. అక్షింతలు వేసి అంతా ఆశీర్వదీస్తారు. ప్రేమను బలవంతంగా బయటకు తీసుకొస్తుంది శారదాంబ. నీకు కూడా అలా చేసి పెళ్లి మండపానికి తీసుకెళ్లేవారు. కానీ, నీ మూర్ఖత్వం వల్ల ఎలాంటి ఆనందాన్ని కోల్పోతున్నావో అర్థమవుతుందా అని శారదాంబ అంటుంది.

ఇంతలో పైనుంచి ప్రేమకు పసుపు నీళ్లు పోస్తాడు విశ్వ. మనం కూడా వాళ్లకంటే తక్కువ ఏం కాదని నిరూపిం...