భారతదేశం, సెప్టెంబర్ 11 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో వీధి చివర ధీరజ్ కారు ఎక్కుతుంది ప్రేమ. అది నర్మద చూస్తుంది. ఇలా దొంగచాటుగా ఇద్దరు వెళ్లడం ఏంటీ. వీళ్లిద్దరు నా ముందు ఏదో డ్రామాలు ఆడుతున్నారు. అదేంటో తెలుసుకోవాలని నర్మద ఫాలో అవుతుంది.

మరోవైపు ఎవరికి తెలియకుండా భలే పెళ్లి చేస్తున్నావని భద్రావతిని పొగుడుతాడు సేనాపతి. రామరాజు ఇంట్లో ఇన్నేళ్లు పెరిగాడు. వాళ్లకు ఇలా పెళ్లి చేయడం కరెక్ట్ కాదని శారదాంబ అంటుంది. అంత పెంచినవాళ్లు అయితే గాలికొదిలేయరు అని భద్రావతి అంటుంది.

మరోవైపు భాగ్యం ఇంటికి ధీరజ్, ప్రేమ వస్తారు. సుకన్యను తీసుకెళ్తారు. ఇక్కడ జరిగినదానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. అంతా నీదే పూచి అన్నట్లుగా మాట్లాడుతుంది భాగ్యం. దీన్ని తిరుపతి బాబాయ్ మీదకు ఉసిగొలిపి ఇప్పుడు ఏం సంబంధం లేదంటా...