భారతదేశం, అక్టోబర్ 17 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో భాగ్యం ఫ్యామిలీని అడ్డుకున్న విశ్వ రామరాజు వాళ్లపై కేసు వాపసు తీసుకోమంటాడు. పగోళ్లు మావాళ్లవరకు వచ్చిందా మ్యాటరు.. మీరు, మీ అత్త చేసిన అన్యాయాల ముందు మేము చేసింది ఎంతని భాగ్యం, వల్లి అంటారు.

నేను అవి తప్పులు అని తెలుసుకున్నా కాబట్టే సరిచేసుకుంటున్నా. నువ్వు ఎన్ని తప్పులు చేసిన వాళ్లు నిన్ను క్షమించారు. ఇప్పుడు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నావని విశ్వ అంటాడు. అసలు ఈ ఐడియా ఇచ్చిందే మీ పెద్దత్త. తప్పుకోవయ్యా. పెద్ద హీరోల వచ్చావుగానీ. మమ్మల్ని ఆపితే మీ అత్తకు చెబుతామని భాగ్యం అంటుంది.

ఏంటీ బెదిరిస్తున్నావా. నేను బెదిరించనా.. కేసు పెట్టి వెనక్కి వస్తారా మీరు. వచ్చి నా నుంచి తప్పించుకోగలరా అని విశ్వ అంటాడు. చూడు ఇది నా భర్తకు నాకు సంబంధించిన ...