భారతదేశం, నవంబర్ 27 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్‌కు చందు అబద్ధం చెప్పినందుకు నవ్వుతుంది అంజలి. టీనేజ్‌లో ఉన్నప్పుడు బైక్‌పై తిరిగేవాళ్లం అని, అప్పుడు మీ నాన్న, మా నాన్న చూస్తారనే టెన్షన్ ఉండేదని, చాలా రోజుల తర్వాత మళ్లీ అలాంటి లవ్ ఫీలింగ్ వచ్చిందని అంజలి చెబుతుంది.

నువ్వు వదిలేసి వెళ్లిపోయాక నా మొహంలో నవ్వే పోయిందని అంజలి బాధపడుతుంది. నేను పెళ్లి చేసుకున్నవాడు ఒక శాడిస్ట్. అన్నింటికి మించి నా మీద అనుమానపడేవాడు. నా జీవితం ఇలా అయిందేంటని చచ్చిపోవాలనుకున్నాను అని అంజలి ఏడుస్తుంది. అలాంటి మాటలు అనకని చందు ఓదారుస్తాడు. అంజలి కన్నీళ్లు తుడుస్తాడు.

వాడితో ఉన్న ఒక్క సంవత్సరం నరకం అంటే ఏంటో తెలిసొచ్చింది. మా నాన్న సహాయంతో బయటపడ్డాను అని చెబుతుంది అంజలి. నీకేం కాదు నేనున్నాగా. నేను చూసు...