భారతదేశం, నవంబర్ 21 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమ విపరీతంగా ఆలోచిస్తుంటే.. నీకున్న కోడి బుర్రతో ఆలోచించకు. అన్ని రేపటికి సెట్ అవుతాయ్. ముందు నీ ఎగ్జామ్స్‌పై ఫోకస్ చేయమని లెక్చర్ ఇస్తాడు ధీరజ్. ఇది ఇంటలిజెంట్ బుర్ర ఒక్కసారి చదివితే వందసార్లు చదివినట్లు. ఏదైనా ఈ బుర్రలో ఉండిపోతాయ్ అని ప్రేమ అంటుంది.

సరే రెండు ప్రశ్నలు అడుగుతాను చెప్పమని ధీరజ్ అంటే.. తికమక ప్రశ్నలు అడుగుతాడనుకున్న ప్రేమ అర్థరాత్రి పెళ్లాన్ని ప్రశ్నలు అడగడం ఏంట్రా. తెల్లారి అడుగు చెబుతానంటుంది. రేపు దీపావళి. పండగ రోజు నేను ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పను అని తప్పించుకుంటావని ధీరజ్ అంటాడు. కనిపెట్టేసావా. అరేయ్ నా బుర్ర పనిచేయట్లేదు. ఏం అడక్కురా. కావాలంటే నువ్వు ఏం చెబితే అది చేస్తానంటుంది ప్రేమ.

సరే ఒక ముద్దు ఇవ్వమని ధీ...