భారతదేశం, మే 2 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్‌ను తన పుట్టింట్లో వదిలేసి రమ్మని ప్రేమ అంటుంది. నీకు నా మీద కోపం ిఉందని, అందుకే తల తుడవట్లేదని ప్రేమ అలుగుతుంది. కోపం లేదని రాత్రే చెప్పాను కదే అని ధీరజ్ అంటాడు. అయినా ప్రేమ వినదు. తల నొప్పిగా ఉన్న నేనే తుడుచుకుంటాను అని కావాలనే నటిస్తుంది ప్రేమ.

నేను తుడుస్తానే అంటూ ధీరజ్ బతిమిలాడుతాడు. కాసేపు ఆటపట్టించి తర్వాత ధీరజ్‌తో తన తల తుడుచుపించుకుంటుంది. ఇంతలో ధీరజ్‌కు ఒకతను కాల్ చేసి 20 వేలు కట్టి కారు బుక్ చేసుకున్నారుగా, కారు రెడీగా ఉందని, రేపటిలోగా డౌన్ పేమెంట్ కట్టి కారుతీసుకెళ్లకుంటే మీరు కట్టిన ప్రీ బుకింగ్ డబ్బు, కారు బుకింగ్ కూడా క్యాన్సిల్ అవుతుందని చెబుతాడు. అమౌంట్ అడ్జస్ట్ కాలేదు, క్యాన్సిల్ చేయండని ధీరజ్ అంటాడు.

ఒక్క నిమిషం ఉండ...