భారతదేశం, జూలై 25 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో సేనాపతి తెచ్చిన కేక్‌లో విషం కలిపారేమో అని ధీరజ్ డౌట్ పడతాడు. దాంతో భద్రావతి ముందుగా కేక్ తిని చూపిస్తుంది. తనకేం కాలేదుగా అని, అమ్మ కోరిక కోసం దిగొచ్చాం కదా అని అన్నింట్లో అనుమానించకూడదు అని భద్రావతి అంటుంది.

ఇప్పుడేం సమాధానం చెబుతావ్ అని ప్రేమ అంటుంది. ఆపండి.. ఫంక్షన్ అయ్యేవరకు ఎవరిని ఏం అనొద్దు అని చెప్పానుగా అని రామరాజు తిడతాడు. మామ అల్లుళ్లు సెటైర్లు వేసుకుంటున్నారని తిరుపతి వాతావరణాన్ని కూల్ చేస్తాడు. అంతా కేక్ తినిపించుకుంటూ శారద పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేస్తారు. అంతా సంతోషంగా చిందులు వేస్తారు.

అందరం కలిసి ఫొటో దిగుదామని శారద అంటుంది. ఫ్యామిలీ ఫొటోకి కెమెరా రెడీ అని తిరుపతి అంటాడు. రామరాజు, భద్రావతి రెండు కుటుంబాలు కలిసి ఉంటాయి....