భారతదేశం, జూలై 23 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో రామరాజు ఇంట్లోకి సేనాపతి, భద్రావతి వాళ్లు వస్తారు. రెండు కుటుంబాలు కలిసి రావడం చాలా సంతోషంగా ఉందని తిరుపతి అంటాడు. వేదవతి చెప్పడంతో నర్మద, ప్రేమలు హారతి తీసుకొచ్చేందుకు వెళ్తారు. తిరుపతిని నీళ్లు ఇవ్వమంటాడు రామరాజు.

నువ్వు ఈ ఇంట్లో పనోడివా.. పిలిచినోళ్లు నీళ్లు ఇవ్వలేరా అని సేనాపతి అంటాడు. ధీరజ్ కోప్పడితే రామరాజు చేయితో ఆపుతాడు. సేనాపతికి చెంబులో నీళ్లు ఇస్తాడు రామరాజు. అందరికి నీళ్లు ఇస్తాడు రామరాజు. అలా రామరాజుతో మర్యాదలు చేయించుకుంటాడు సేనాపతి. భద్రావతి కాళ్లు కడుగుతుంది వేదవతి. ఇదంతా నా ఆనందం కోసం, పాతికేళ్ల భారాన్ని కడిగేసుకోడం కోసం అని వేదవతి అంటుంది.

ఈ ఇంటి పనోడిని చేసుకుంది నీళ్లతో కడిగితే పోయే పాపం కాదని సేనాపతి అంటాడు. ఏంటీ మా...