భారతదేశం, జూలై 17 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో హోటల్‌కి వెళ్లిన ధీరజ్, ప్రేమలు పెళ్లయిన గది తాళాలు తీసుకుని లోపలికి వెళ్తారు. రూమ్‌లోకి వెళ్లిన ధీరజ్, ప్రేమ ఇదివరకు గదిలో ఉండటం, పోలీసులు రావడం, తాళి కట్టడం, పోలీసులు రావడం గుర్తు చేసుకుంటారు. ఇద్దరు ఎమోషనల్ అవుతారు.

తర్వాత బయటకు వస్తారు. మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని, ఒకరి చేతిని మరొకరు వదలకూడదని అనుకుంటారు. కారులో వెళ్లిపోతారు. అక్కడే ఉన్న భాగ్యం, ఆనందరావు హా మీరు అనుకుంది జరగనిస్తామా. మీ కాపురంలో నిప్పులు పోసి మీరు సంతోషంగా లేకుండా చేస్తామంటారు. హోటల్ దగ్గర కాపు కాస్తారు ఇద్దరు.

ఇడ్లీ బాబాయ్ నిద్రపోతే భాగ్యం గిల్లి లేపుతుంది. ఏంటీ ఈ మోటు సరసం అంటాడు. మేనేజర్ దగ్గరికి వెళ్లి ధీరజ్, ప్రేమల పెళ్లి రహస్యం గురించి తెలుసుకుందామనుకున్నాం...