భారతదేశం, ఆగస్టు 8 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్ ప్రేమను విడగొట్టడానికి భద్రావతి కుట్ర చేసిందని అక్కతో అంటుంది వేదవతి. ఆరోజు ప్రేమ జీవితం మీద మచ్చ పడితే నా పుట్టింటివాళ్లు ఆ అవమానం తట్టుకోలేరని మీ ప్రాణాల గురించి ఆలోచించాను. నిజంగా మీరిపోతే ఈ చెల్లెలిని అర్థం చేసుకునేవాళ్లు అని వేదవతి అంటుంది.

అయితే, ఇప్పుడు ఏంటని భద్రావతి అంటుంది. ప్రేమ నా కోడలు. ఒకరోజు అటు ఇటు కావచ్చు కానీ, ఏదో ఒక రోజు నా కోడలు నా ఇంటికి వస్తుందని వేదవతి అంటుంది. నీ మొహం ఇందాక ప్రేమ చెప్పిందిగా అది జరగదని భద్రావతి వెళ్లిపోతుంది. నా కోడలు నా ఇంటికి రాకుండా ఎలా ఆపుతావో నేను చూస్తాను అని వేదవతి ఛాలెంజ్ చేసి వెళ్తుంది.

భద్రావతి కాస్తా ఆలోచనల్లో పడుతుంది. ఈ సంవత్సరం గుడికి వెళ్లొద్దని సేనాపతి అంటాడు. ఆ కూలోడి కుటు...