భారతదేశం, ఆగస్టు 22 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో వేదవతి కాఫీ అద్భుతంగా ఉందని విశ్వ అంటుంది. ప్రేమ చేతిపై ఆ పేరు ఎవరు రాశారని విశ్వ అడుగుతాడు. మా అక్క అలా ఇన్‌డైరెక్ట్‌గా చేయదు, నాన్న కూడా కూతురు పరువు తీయడు. కానీ, నర్మద మాత్రం ఆ ఇంట్లో వాళ్లే చేశారని బలంగా నమ్ముతుందని వేదవతి అంటుంది.

అది నేను కనిపెడతానని విశ్వ అంటాడు. రేయ్ నిన్ను నిజంగా నమ్మొచ్చారా అని వేదవతి అంటుంది. మా అమ్మ మీద ఒట్టు. నేను మారాను అని విశ్వ వెళ్లిపోతాడు. వీడిలాగే మా అక్క, అన్నయ్య మారితో బాగుండని వేదవతి అనుకుంటుంది. మరోవైపు శ్రీవల్లి కళ్లకు గంతలు కట్టి ఇంటికి తీసుకెళ్తాడు. పెద్ద సర్‌ప్రైజ్ అని చెబుతారు. చింతామణి ఎంట్రీ ఇస్తుంది.

చింతామణికి ఇవ్వాల్సిన రూ. 6 లక్షలను నీ చేత్తో ఇప్పిద్దామని తీసుకొచ్చానని భాగ్యం అంటుంది....