భారతదేశం, మార్చి 1 -- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ల్యాబ్ హెల్పర్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. రెండు ఖాళీలున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

కేంద్ర లేదా రాష్ట్రానికి చెందిన సంస్థల్లో స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ ల్యాబ్ పరికరాల నిర్వహణలో కనీసం ఒక ఏడాది అనుభవం ఉండాలి. వెల్డింగ్, కటింగ్ & డ్రిల్లింగ్‌లో నైపుణ్యం తప్పనిసరి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 30 ఏళ్ల లోపు ఉండాలి.

ఈ పోస్టకు ఎంపికైన వారికి నెలకు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు జీతం చెల్లిస్తారు. ఎంపికైన వారు. ల్యాబ్ పరీక్షల కోసం స్టీల్ శాంపిల్స్‌ను వెల్డింగ్, కటింగ్ అండ్ డ్రిల్లింగ్ ద్వారా సిద్ధం చేయడం, ల్యాబ్ టీమ్ త...