భారతదేశం, ఏప్రిల్ 18 -- భారత బ్యాంకింగ్ రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ తర్వాత అత్యంత పటిష్టమైన స్థితిలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్, 2026 ఆర్థిక సంవత్సరం ముగింపులో ఇన్వెస్టర్లకు తీపి కబురు అందించింది. శనివారం (ఏప్రిల్ 18) వెల్లడించిన ఫలితాల ప్రకారం, జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం 8.5 శాతం వృద్ధితో రూ. 13,701.68 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో ఈ లాభం రూ. 12,629.58 కోట్లుగా ఉండేది. ముఖ్యంగా అంతకుముందు త్రైమాసికం (క్యూ3)తో పోలిస్తే లాభం ఏకంగా 21 శాతం పెరగడం గమనార్హం.

బ్యాంకు లాభాల్లో కీలక పాత్ర పోషించే నికర వడ్డీ ఆదాయం (NII) ఈసారి 8.4 శాతం పెరిగి రూ. 22,979 కోట్లకు చేరింది. బ్యాంకులు ఇచ్చే రుణాలపై వచ్చే వడ్డీకి, డిపాజిటర్లకు చెల్లించే వడ్డీకి మధ్య ఉండే వ్యత్యాసాన్ని ఇది సూచిస్తుంది. ఇక బ్యాంకింగ్ రంగం నిశితంగా గమనించే నికర వడ్డీ మార్జిన్ ...