భారతదేశం, ఏప్రిల్ 6 -- నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు, పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళనలను వ్యక్తం చేస్తున్నాయి. వేసవిలో ఐస్‌క్రీమ్ బండ్లు చాలా వరకు ఊర్లలోకి వస్తున్నాయి. దీనిద్వారా పిల్లల ఆరోగ్యం పాడవుతుంది. ఇది గమనించిన పలు గ్రామాల ప్రజలు ఐస్‌క్రీమ్ విక్రయాలను నిషేధించాయి.

ఐస్‌క్రీమ్ బండ్లు గ్రామాల్లోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ నిజామాబాద్ జిల్లాలోని పలు పంచాయతీ పాలకవర్గాలు తీర్మానాలను ఆమోదించాయి. ఈ ఆదేశాన్ని ఉల్లంఘించే విక్రేతలకు రూ.5,000 జరిమానా విధిస్తామని గ్రామాల్లో హెచ్చరిస్తూ పోస్టర్లను ఏర్పాటు చేశారు. నిజానికి మెుదట కొన్ని గ్రామాల్లో ఈ ఉద్యమం మెుదలైంది. తర్వాత తర్వాత పలు మండలాలకు వ్యాపించింది.

డిచ్‌పల్లి మండలంలోని సుద్దపల్లి, మక్లూర్ మండలంలోని మందాపూర్, అలాగే డొంకేష్వర్ మండలంలోని గాదేపల్లి, అన్నారం, నుత్పల్లి, తొండకూర్ వంట...