భారతదేశం, ఏప్రిల్ 9 -- Hyundai set to increase car prices: తెలుగు రాష్ట్రాల్లో మధ్యతరగతి ప్రజల ఫేవరెట్ కార్ బ్రాండ్లలో ఒకటైన హ్యుందాయ్, వాహనదారులకు షాక్ ఇచ్చింది. వచ్చే నెల (మే 2026) నుంచి తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని కార్ల ధరలను పెంచబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మీరు గ్రాండ్ i10 నియోస్ నుంచి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు అయానిక్ 5 వరకు ఏది కొనాలనుకున్నా, ఇప్పుడున్న ధర కంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

కంపెనీ ప్రతినిధుల సమాచారం ప్రకారం.. వాహనాల తయారీకి అయ్యే ఖర్చులు (Input Costs) గణనీయంగా పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. గత కొంతకాలంగా పెరిగిన ముడి సరుకుల భారాన్ని కంపెనీయే భరిస్తూ వచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ భారాన్ని కొంతమేర వినియోగదారులపై వేయక తప్పడం లేదని హ్యుందాయ్ స్పష్టం చేసింది.

ఈ పెంపు గరిష్టంగా ఒక శాతం వరకు ఉండనుంది...