భారతదేశం, ఏప్రిల్ 30 -- హైదరాబాద్ నగరంలో శిథిలావస్థకు చేరిన భవనాలు, పాత కట్టడాల వల్ల ఎదురయ్యే ప్రాణనష్టాన్ని నివారించేందుకు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎప్పుడైనా కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటువంటి ప్రమాదకర కట్టడాల సమాచారాన్ని వెంటనే తమకు అందించాలని కోరుతూ.. 9000113667 అనే హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రకటించింది.

బుధవారం సాయంత్రం బెంగళూరులోని శివాజీనగర్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి ఒక ఆసుపత్రి సమీపంలో ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లో కూడా గతంలో ఇటువంటి పాత భవనాలు కూలి అమాయకులు బలిని తీసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే, అకాల వర్షాలు కురుస్తున్న వేళ నగరంలో మరోసారి అ...