భారతదేశం, ఆగస్టు 14 -- హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఉన్న M-47 ప్యాటన్ ట్యాంక్ వరకు నిర్వహించతలపెట్టిన తిరంగా ర్యాలీ(Tiranga Rally) సందర్భంగా ఈ ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ర్యాలీ జరిగే సమయంలో సజావుగా ట్రాఫిక్ నిర్వహణ కోసం పోలీసులు కింద పేర్కొన్న విధంగా రూట్లను మళ్లించారు.

కర్బలా మైదాన్ వైపు నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ వైపు మళ...