భారతదేశం, మే 9 -- హైదరాబాద్‌లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ(10-05-2026) జరగనుంది. దీంతో నగర పోలీసులు ఏర్పాట్లు చేశారు. బస్సుల పార్కింగ్, ట్రాఫిక్ రూట్ అడ్వైజరీ జారీ చేశారు. ప్రయాణికులు ఈ సూచలను పాటించాలని చెప్పారు. తద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయన్నారు.

ఆదివారం, మే 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే బస్సుల కోసం నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా బస్సులు ఎక్కడ ఆగాలి? ఎక్కడ పార్కింగ్ చేయాలో వెల్లడించారు.

పార్కింగ్ ప్రదేశాలు: ఐ.ఏ.ఎల్.ఏ (IALA) పార్కింగ్, ఆర్.జీ.ఐ (RGI) స్టేడియం (సామర్థ్యం: 900), ఉప్పల్ భగాయత్ (100), రైల్వే డిగ్రీ కాలేజీ (100), ఆర్.ఆర్.సి(RRC) గ్రౌండ్స్ (100).

అధికారి కాంటాక్ట్ నెంబర్ : ...