భారతదేశం, ఆగస్టు 25 -- హైదరాబాద్ నగరవాసులకు పోలీసులు ముఖ్యమైన అలర్ట్ జారీ చేశారు. మిలాద్-ఉన్-నబీ పండగ సందర్భాన్ని పురస్కరించుకుని నాంపల్లి సమీపంలోని దారూస్సలాంలో ఉన్న ఏఐఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయంలో భారీ 'జల్సా' కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆగస్టు 25వ తేదీ సాయంత్రం 6:00 గంటల నుంచి ఆగస్టు 26వ తేదీ ఉదయం 4:00 గంటల వరకు ఈ సభ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో దారూస్సలాం పరిసర ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు మార్గాల్లో వాహనాల మళ్లింపు చేపట్టారు.

నగరంలో వాహనదారులకు తీవ్ర అంతరాయం కలగకుండా. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు కాకుండా ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) వెల్లడించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

సభకు హాజరయ్యే ప్రజలు తమ వాహ...