భారతదేశం, జూలై 28 -- హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై విపరీతంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వరద నీటితో ఉన్న రోడ్లపై జాగ్రత్తగా వెళ్లాలి అని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరం అయితే తప్పా.. బయటకు రావొద్దని చెప్పారు.

హైదరాబాద్‌ నగరంలోని మియాపూర్, కూకట్‌పల్లి, రాయదుర్గం, మణికొండ, హైటెక్‌సిటీ, మాదాపూర్‌, యూసుఫ్‌గూడ, ఖైరతాబాద్‌, కోఠి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, నాచారం, కాప్రా, ఉప్పల్, నారపల్లితోపాటుగా ఇతర ప్రాంతాల్లోనూ వానలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉంది.

ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రం 5 గంటల సమయంలో ఒక్కసారిగా మారి ఆకాశం మేఘావృతమైంది. ఆ తర్వాత నగరవ్యాప్తంగా, ముఖ్యంగా రద్దీ వేళల్లో వర్షం కురిసింది. వాతావరణంలో వచ్చిన ఈ అకస్మాత్తు మార్...