Hyderabad ORR : ఓఆర్ఆర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం -లారీని ఢీకొట్టిన ఆటో, ముగ్గురు మృతి
భారతదేశం, నవంబర్ 8 -- Hyderabad ORR Road Accident :హైదరాబాద్ నగర శివార్లలో అర్థరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అప్పా జంక్షన్ వద్ద వేగంగా వస్తున్న ఆటో, ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా... మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
ప్రమాద సమయంలో ఆటోలో పెయింటింగ్ పనులు ముగించుకుని తిరిగి వస్తున్న కార్మికులు ఉన్నారు. వీరంతా శంషాబాద్ వైపు నుంచి మొయినాబాద్కి ప్రయాణిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి అప్పా జంక్షన్ వద్ద ఎగ్జిట్ అవుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.
సాధారణంగా పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను తీసుకెళ్లాల్సిన ఆటోలో ఏకంగా 15 మందికిపైగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.