భారతదేశం, అక్టోబర్ 22 -- హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు త్వరలోనే మరిన్ని మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు, భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు గాను మెట్రో నెట్‌వర్క్‌కు కొత్తగా 60 కోచ్‌లను జోడించేందుకు హైదరాబాద్ మెట్రో సిద్ధమైంది.

సుమారు రూ. 923.62 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం డిజైన్, తయారీ, సరఫరా, నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో బిడ్డర్ల నుంచి టెండర్లను ఆహ్వానించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(HMRL) తరఫున ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూరుస్తుండగా, హెచ్‌ఎంఆర్‌ఎల్ ప్రాజెక్ట్ యజమానిగా ఉంటుంది.

జనవరి 13, 2027 వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ...